త్వరలో ప్రైమ్ వీడియో లోకి “ఈగిల్”

త్వరలో ప్రైమ్ వీడియో లోకి “ఈగిల్”

Published on Feb 26, 2024 6:09 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ చిత్రం కి సంబందించిన స్ట్రీమింగ్ రైట్స్ ను ఈటీవీ విన్ కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండింటిలో ఒకేసారి స్ట్రీమింగ్ కి వస్తుందా? లేక వేరే ఇతర తేదీల్లో వస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా, నవదీప్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు