ఫ్యాన్స్‌కు షాక్.. అక్కడ ‘కూలీ’ ఎర్లీ ప్రీమియర్స్ క్యాన్సిల్

Coolie 5

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అవుతుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్‌లోనూ సాలిడ్ హైప్ క్రియేట్ అయింది.

అయితే, ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిని చూపుతున్నారు. కానీ, యూఎస్‌లోని కొన్ని చోట్ల ఎర్లీ ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని కారణాల వల్ల ఈ ప్రీమియర్ షోలు రద్దయినట్లు తెలుస్తోంది.

దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Exit mobile version