ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో వస్తున్న రాజ్ తరుణ్

iddari lokam 1

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సారి ఇద్దరి లోకం ఒకటే అనే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో మెస్మరైజ్ చేయడానికి వస్తున్నాడు. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటరైనర్ ని దర్శకుడు జి ఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. చిన్నప్పటి పరిచయం తరువాత విడిపోయి మళ్ళీ కలుసుకున్న ఇద్దరు యంగ్ కపుల్ మధ్య నడిచే ఎమోషనల్ లవ్ జర్నీనే ఈ ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. నేడు విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికంగా అనిపించింది.

యువ జంటగా రాజ్ తరుణ్, షాలిని చాలా బాగున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. విజయాలకు చిరునామా లాంటి బ్యానర్ లో వస్తున్న చిత్రం కావడంతో రాజ్ తరుణ్ ఖచ్చితంగా హిట్ కొడతాడు అనిపిస్తుంది. ఈనెల 25న క్రిస్మస్ కానుకగా ఇద్దరిలోకం ఒకటే విడుదల కానుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ మిక్కీ జె మేయర్ అందించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version