పుష్ప‌-2 నుంచి వాకౌట్ చేసిన టెక్నీషియ‌న్

పుష్ప‌-2 నుంచి వాకౌట్ చేసిన టెక్నీషియ‌న్

Published on Jun 11, 2024 2:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌-2’ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శకుడు సుకుమార్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఇప్ప‌టికే ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ ఈ మూవీపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌ వార్త సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

‘పుష్ప‌-2’ సినిమా నుండి ఎడిట‌ర్ కార్తీక్ శ్రీనివాస్ వాకౌట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. సుకుమార్ తో క్రియేటివ్ విభేదాలు తలెత్త‌డంతో, ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కొచ్చేశారు. దీంతో ‘పుష్ప‌-2’ యూనిట్ న‌వీన్ నూలి ని ఎడిట‌ర్ గా త‌మ ప్రాజెక్టులో చేర్చుకుంది. దీనికి సంబంధించి అఫీషియ‌ల్ గా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ, ‘పుష్ప‌-2’ సినిమాకు సంబంధించిన కొత్త పోస్ట‌ర్స్, ‘సూసేటి’ సాంగ్ క్రెడిట్స్ లో ఎడిట‌ర్ గా న‌వీన్ నూలి పేరును వేశారు మేక‌ర్స్.

గ‌త‌కొన్నేళ్లుగా కార్తీక్ శ్రీనివాస్ సుకుమార్ తో క‌లిసి ప‌నిచేస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న ఎందుకు ‘పుష్ప‌-2’ నుంచి వాకౌట్ చేశారా అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ‘పుష్ప‌-2’ సినిమాను ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. కాగా, ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, సునీల్, అన‌సూయ‌, ఫహాద్ ఫాజిల్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు