మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతున్న రాజమౌళి ఈగ

మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతున్న రాజమౌళి ఈగ

Published on Nov 22, 2011 11:12 PM IST

Eega Naan Ee Tamil
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఈగ’. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో వచ్చే ఏడాది మార్చ్ నెల చివరి వారంలోవిడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో మరియు ట్రైలర్ ను ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. మొదటగా మార్చి నెల కంటే రెండు నెలల ముందే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ చివరికి మార్చ్ లో రిలీజ్ చేయాలనీ నిర్ణయించారు. నాని, సమంతా, సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తతం ఈ చిత్రానికి సంబందించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సాయి కొరపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ‘ఈగ’ తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు