విడాకులకు అప్లై చేసిన ఈగ స్టార్ సుధీప్

Sudeep
‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించిన కన్నడ స్టార్ హీరో సుధీప్, ఆ సినిమాతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం కన్నడలో మంచి హిట్స్‌తో దూసుకుపోతోన్న ఈ స్టార్, వ్యక్తిగత జీవితంలో తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరచింది. తన భార్య ప్రియతో తనకు విడాకులు ఇప్పించవలసినదిగా సుధీప్ కోర్టును ఆశ్రయించారు. 2001లో సుధీప్, ప్రియలు వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారికి 11 సంవత్సరాల పాప ఉన్నారు.

గత కొన్నాళ్ళుగా తమ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తలెత్తాయని, దీంతో ఇద్దరూ ఇదే విషయమై కోర్టులో విడాకుల కోసం మంజూరు చేశారు. ఈ విడాకుల కోసం సుధీప్, భార్య ప్రియకు పెద్ద మొత్తంలో భరణం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అభిమానులు ఈ విషయంలో తనకు కొంత వ్యక్తిగత ప్రైవసీ ఇవ్వాలని సుధీప్ కోరారు. ఇక ఇదిలా ఉంటే సుధీప్ త్వరలో విడుదల కానున్న ‘పులి’ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version