అందుకే ‘బందిపోటి’ అయ్యాను – ఈషా

Bandipotu-still
నేను ‘బందిపోటు’ సినిమాలో ఇండిపెండెంట్ వర్కింగ్ విమెన్ జాహ్నవి పాత్రలో కనిపిస్తాను. నరేష్ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించి సంపన్నులు అయిన వారిని దోచుకుంటాడు. నేను అతని మనసు దోచుకున్నాను. అందుకే ‘బందిపోటి’ అయ్యాను అంటోంది తెలుగమ్మాయి ఈషా. అల్లరి నరేష్ సరసన ఈషా జంటగా నటించిన సినిమా ‘బందిపోటు’. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసింది. తన పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని చెప్తుంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. వారితో నటించడం గొప్ప అనుభూతి. షూటింగ్ సమయంలో నరేష్ ఎలా నటించాలో కొన్నిసార్లు సలహాలు ఇచ్చేవారు. అతని నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అని ఈషా చెప్పింది.

ఇ.వి.వి. సినిమా పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ నిర్మాతలు. శ్రద్ధా దాస్ ప్రత్యేక గీతంలో నర్తించింది.

Exit mobile version