రామ్ చరణ్ కి వీరాభిమానిని అంటున్న బాలీవుడ్ భామ

ram-charan-esha-gupta
మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన టాలెంట్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ అభిమానుల జాబితాలో బాలీవుడ్ హాట్ భామ ఈశ గుప్త కూడా వచ్చి చేరింది. రామ్ చరణ్ బాలీవుడ్ లో చేసిన సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం కొంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

ఈశ గుప్తా టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నాతో కలిసి హంషకల్స్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో తమన్నా సౌత్ ఇండియన్ సినిమాలో నటిస్తావా? అని ఈశని అడిగితే ఈ హాట్ బ్యూటీ తనకి రామ్ చరణ్ అంటే బాగా ఇష్టం అని అతనికి పెద్ద అభిమానిని, తెలుగులో అతని సరసన నటించాలని ఉందని తెలిపింది. అలాగే తమిళ్ లో సూర్య సరసన నటించాలని ఉందని తెలిపింది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, ఈశ బాగా కలిసి తిరుగుతున్నారు. ఈశ గుప్తని తమన్నా గురించి అడిగితే ‘తమన్నా చాలా లవ్లీ పర్సన్, నాకు చాలా మంచి ఫ్రెండ్ అని’ చెప్పింది.

Exit mobile version