తమ నెక్స్ట్ కి పవర్ఫుల్ టైటిల్ లాక్ చేసిన “ఈగల్” మేకర్స్?

తమ నెక్స్ట్ కి పవర్ఫుల్ టైటిల్ లాక్ చేసిన “ఈగల్” మేకర్స్?

Published on Mar 3, 2024 5:39 PM IST

ప్రస్తుతం అనేక సినిమాలు ప్రొడక్షన్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే అని చెప్పాలి. ఇక రీసెంట్ గానే టాలీవుడ్ లో మంచి స్టైలిష్ యాక్షన్ ఫీస్ట్ ని “ఈగల్” తో అందించారు. మరి ఈ చిత్రం తర్వాత మరిన్ని సాలిడ్ క్వాలిటీ చిత్రాలతో తాము రాబోతుండగా లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ఓ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది.

మేకర్స్ ఈ మార్చ్ 4న ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని ఉదయం 11 గంటల 5 నిమిషాలకి అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ పోస్టర్ అది చూస్తుంటే మళ్ళీ ఏదో గట్టి ప్రాజెక్ట్ నే తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ చిత్రంని దర్శకుడు విజయ్ యెలకంటి తెరకెక్కించనుండగా మేకర్స్ దీనికి “మా కాళీ” అనే పవర్ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో జరిగే సినిమా కాగా ఆ నేపథ్యంలో ఈ టైటిల్ ని పెట్టినట్టుగా సమాచారం. మరి రేపు వచ్చే అప్డేట్ అదే కాదో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు