ఆస్కార్స్ లైబ్రరీలో ఈగో హిట్ “పార్కింగ్” కి చోటు

ఆస్కార్స్ లైబ్రరీలో ఈగో హిట్ “పార్కింగ్” కి చోటు

Published on May 23, 2024 3:53 PM IST

గత ఏడాది తమిళ నాట వచ్చిన పలు హిట్ చిత్రాల్లో హరీష్ కళ్యాణ్ హీరోగా బిగిల్ ఫేమ్ ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఈగో థ్రిల్లర్ చిత్రం “పార్కింగ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో రెండు జెనరేషన్ లకి చెందిన వ్యక్తుల నడుమ జరిగే ఈగో క్లాష్ ని బాగా చూపించడంతో మంచి లాంగ్ రన్ తో తమిళ నాట సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.

అయితే ఈ చిత్రంకి ఇప్పుడు అనూహ్యంగా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకోవడం అరుదైన అంశంగా నిలిచింది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అంశాన్ని ఆస్కార్స్ వారు కొన్ని ముఖ్యమైన కలెక్షన్ లో ఒకటిగా పార్కింగ్ స్క్రీన్ ప్లే కి కూడా చోటు కల్పించారట.

దీనితో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా పంచుకుంటున్నారు. అలాగే యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ అకాడమీ వారికి తన చిత్ర యూనిట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసాడు. ఇక ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ కి అపోజిట్ పాత్రలో ఎం ఎస్ భాస్కర్ నటించగా ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్ ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు