ఫిబ్రవరిలో రాబోతున్న ఏకవీర

ఫిబ్రవరిలో రాబోతున్న ఏకవీర

Published on Jan 23, 2012 10:00 AM IST


ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి గారి అబ్బాయి నటించిన చిత్రం ‘ఏకవీర’. ఈ చిత్రం 18వ శతాబ్దం నేపధ్యంలో తెరకెక్కుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఏకవీర చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతుంది. తమిళ్లో రూపొందిన ‘అరవాన్’ చిత్రాన్ని తెలుగులో ఏకవీర పేరుతో డబ్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ధన్సిక హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నేపధ్య గాయకుడు కార్తీక్ సంగీత దర్శకుడిగా మారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భరత్ మరియు అంజలి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పశుపతి మరియు శ్వేత మీనన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు పంపిణీ హక్కులు శ్రీనివాస్ దామెర దక్కించుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు