మే 10న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ఆరంభం. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తుండగా అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆరంభం సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇక అనౌన్స్ మెంట్ నుంచి ఆరంభం సినిమా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో పాటు ఇటీవల హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేసిన అనగా అనగా లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్ మూవీ చూసిన ఎక్సీపిరియన్స్ ను ఆరంభం ప్రేక్షకులకు ఇవ్వబోతోంది.

తమ సినిమా యొక్క విజయం పై యూనిట్ నమ్మకంతో ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా ఎడిటర్ గా ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి, సినిమాటోగ్రాఫర్ గా దేవ్ దీప్ గాంధీ కుందు, మ్యూజిక్ డైరెక్టర్ గా సింజిత్ యెర్రమిల్లి, డైలాగ్ రైటర్ గా సందీప్ అంగిడి, సౌండ్ ఇంజనీర్ గా మాణిక ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వినయ్ రెడ్డి మామిడి, అలానే సీఈవోగా ఉజ్వల్ బీఎం పని చేస్తున్నారు.

Exit mobile version