
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మునుపెన్నడూ కనపడని రీతిలో సూపర్ స్టైలిష్ మరియు మోస్ట్ గ్లామరస్ గా కనిపించనుంది. ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందని అడిగితే ‘ఈ సినిమా ట్రైలర్ లోనే మీకు అర్థమై ఉంటుంది, ఎన్.టిఆర్ ఇందులో ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ అని, అలా అవినీతి మార్గంలో వెళ్తున్న దయాని మంచి మార్గంలో నడిపించే హీరోయిన్ పాత్రలో కనిపిస్తాను. ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని’ తెలిపింది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రోమోస్ వల్ల ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎన్.టి.ఆర్ కూడా మునుపెన్నడూ కనిపించని తరహాలో సిక్స్ ప్యాక్ చేసి, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో పంచ్ డైలాగ్స్ చెబుతుండడంతో అభిమానుల్లో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ పెర్ఫార్మన్స్ తో పాటు పూరి జగన్నాధ్ టేకింగ్, పవర్ఫుల్ డైలాగ్స్, స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్స్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.