లేటెస్ట్…అడివి శేష్ “G2” లోకి ఇమ్రాన్ హష్మీ!

లేటెస్ట్…అడివి శేష్ “G2” లోకి ఇమ్రాన్ హష్మీ!

Published on Feb 15, 2024 1:32 PM IST


టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ కుమార్ సిరిగినేడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి 2 (G2). ఈ చిత్రం గూఢచారి మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు అంటూ గతం లో వార్తలు వచ్చాయి.

అయితే నేడు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం లో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ తో వర్క్ చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు హీరో అడివి శేష్ తెలిపారు. పార్ట్ వన్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం తో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. తెలుగు భాషలో మాత్రమే కాకుండా, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు