పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.
అయితే, తాజాగా ఓజి చిత్రానికి సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు ఇమ్రాన్. ఈ సినిమాలో తాను, పవన్‌తో కలిసి చేయాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని.. ఇప్పటివరకు తన సోలో షూటింగ్ మాత్రమే జరిగిందని ఆయన తెలిపాడు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీ గా ఉందని ఆయన అన్నాడు.
దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా హీరో-విలన్ మధ్య సీన్స్ షూటింగ్ జరుపుకోకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
