ఓటిటీలోకి ఎనర్జిటిక్ స్టార్ సినిమా ?

ఓటిటీలోకి ఎనర్జిటిక్ స్టార్ సినిమా ?

Published on Aug 30, 2020 8:35 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ‘రెడ్’ మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నా.. కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తోందని.. కానీ చిత్రబృందం ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసిందని.. ఓటిటీలో తమ సినిమాని రిలీజ్ చేయమని మేకర్స్ స్పష్టం చేసినట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మేకర్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఆఫర్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా భారీ సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఈ ఏడాది ఉండేలా లేదు. ఉన్నా జనం వచ్చే దాకా నమ్మకం లేదు. అందుకే, సినిమా స్థాయికి తగ్గ రేట్ వస్తే ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారని.. ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5తో మేకర్స్ చర్చలు కూడా జరుపుతున్నారని.. అన్ని కుదిరితే దసరాకి ఓటిటిలో రెడ్ రిలీజ్ ఉండొచ్చు అని తెలుస్తోంది. ఇక సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు