
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ‘ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ఆది, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా తనపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ సైలెంట్ గా తన ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశాడు యువ హీరో ఆది.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరుణ అనే అమ్మాయితో ఆది నిశ్చితార్ధం జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. త్వరలోనే వివాహ మాహోత్సవ వేడుక ఉంటుందని సమాచారం. గత కొంత కాలంగా మీడియాలో ఆది ప్రేమ వ్యవహారానికి సంబందించిన వార్తలు వస్తున్నాయి.