‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ వర్మ మార్కు మార్షల్ ఆర్ట్స్ మూవీ.

‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ వర్మ మార్కు మార్షల్ ఆర్ట్స్ మూవీ.

Published on Nov 27, 2019 3:52 PM IST

enter the girl dragon

సంచలనాల వర్మ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ . హీరోయిన్ ప్రధానంగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. పూజా భాలేకర్ అనే ఓ కొత్త అమ్మాయిని మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ గా వర్మ చూపించనున్నాడు. జనరల్ గా మార్షల్ ఆర్ట్స్ చిత్రం అంటే పద్దతిగా యూనిఫార్మ్ లేదా బట్టలు వేసుకొని ఫైట్స్ చేస్తారు. అందరిలా సినిమా చేస్తే ఆయన వర్మ ఎందుకు అవుతారు. పూజ చేత ఓ రేంజ్ లో స్కిన్ షో చేయించాడు. ఆమె హాట్ డ్రెస్సులలో హీటెక్కించే పోరాటాలు చేశారు. ఐతే పూజా యాక్షన్ స్టంట్స్ లో ఇరగదీసింది.

బ్రూస్ లీ పై అభిమానంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి ఒకరితో ప్రేమలో పడుతుంది. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం లేని అబ్బాయి అది వదిలెయ్ మంటాడు. బ్రూస్ లీ కి, ప్రేమికుడికి, ఆ అమ్మాయికి మధ్య నడిచే ట్రై యాంగిల్ లవ్ స్టోరీనే ఈ చిత్రం అని తెలుస్తుంది. ఈ చిత్రాన్నిదర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు