ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోన్న ‘ఎంత మంచివాడవురా’ !

ఫస్ట్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోన్న ‘ఎంత మంచివాడవురా’ !

Published on Jan 9, 2020 8:00 PM IST

Entha 1

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. కాగా నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ లోకి వెళ్ళిపోయింది. నిజానికి ట్రెండ్ లో లేని ఈ సినిమా.. ఒక్కసారిగా ట్రైలర్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం నిజంగా విశేషమే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అథితిగా వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా ట్రైలర్ జనంలోకి బాగా వెళ్ళింది.

ఇక ట్రైలర్ లో హీరో క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశారు. అలాగే ఎమోషన్, యాక్షన్ అండ్ కామెడీను కూడా బాగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు యాక్షన్ కూడా జోడించి ‘ఎంత మంచివాడవురా’ను ఆల్ ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దిన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు