‘ఎంత మంచివాడవురా’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్ !

‘ఎంత మంచివాడవురా’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్ !

Published on Dec 30, 2019 3:47 PM IST

Entha Manchivaadavuraa

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను జనవరి 8న హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలుస్తోంది. ‘ఎన్టీఆర్ – బాలయ్య’ ఒకే వేదిక పై చూడాలని నందమూరి ఫ్యాన్స్ చాల ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఇక ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు