‘ఎంత మంచివాడవురా’లో ఫన్ కూడా ఉందట !

‘ఎంత మంచివాడవురా’లో ఫన్ కూడా ఉందట !

Published on Jan 13, 2020 9:05 AM IST

ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా”. కాగా ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తనకు తెలియకుండానే హీరో చేసే కొన్ని పనులు వల్ల విలన్ కి పెద్ద మేలు జరుగుతుందట. అదే విధంగా అప్పటికే హీరో చేసిన కొన్ని ఆకతాయి పనులు కారణంగా కూడా సినిమాలోని కొంతమంది చెడ్డ వ్యక్తులకు మంచి జరుగుతుందట.

మొత్తానికి హీరో ఇవ్వన్నీ తానూ కావాలని చేయడని, అనుకోకుండా అతను చేసే పనులు వల్ల వారికి అంతా మంచి జరుగుతుందని తెలుస్తోంది. దాంతో తన వల్ల జరిగిన పొరపాట్లును సరిదిద్దే ప్రయత్నం చేస్తాడట, ఇదే ఈ చిత్రం మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. గుజ‌రాతీ చిత్రం ‘ఆక్సిజ‌న్’ సినిమా ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారట. అయితే హీరో లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా ఓ నాట‌క రంగమే అని నమ్ముతాడు. ఆ తరువాత అంద‌రికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడని.. కానీ హీరో వల్ల విలన్స్ కే ఎక్కువ మేలు జరగడం కొంచెం ఫన్నీగా సాగుతుందట సినిమా. ఈ సినిమాలో ఫన్ కూడా బాగానే ఉంది అన్నమాట.

శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు