దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది : బాలక్రిష్ణ

తెలుగు ఖ్యాతిని ప్రపంచ దశదిశలా వ్యాప్తి చేసిన నటుడు, నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా ఆయన కుమారుడు, నటుడు బాలక్రిష్ణ రూపొందించనున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈరోజే ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు క్లాప్ కొట్టగా రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీనులు మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్బంగా బాలక్రిష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక్క తెలుగువారికి మాత్రమే సంబందించిన వ్యక్తికాదు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది జాతీయ నాయకులు, నటులు ఎదిగారు. ఆయన చేసిన రాజకీయ సంస్కరణలు దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పుల్ని తెచ్చాయి. ఆయన దేశ సంపద. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది అన్నారు. అలాగే స్క్రిప్ట్ చాలా బాగా వస్తోందని కూడ అన్నారు. త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.