ఎరోస్ చేతికి రజినీకాంత్ ‘లింగ’.

ఎరోస్ చేతికి రజినీకాంత్ ‘లింగ’.

Published on Nov 10, 2014 6:02 PM IST

erros-ling

సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటినటులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లింగ’. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమా సర్వ హక్కులను బాలీవుడ్ కి చెందిన ప్రతిష్టాత్మక ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. భారి కాస్టింగ్ తో రూపొందిన ‘లింగ’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందని ఎరోస్ ఎండి సునీల్ లుల్లా తెలిపారు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ‘లింగ’ సినిమాను ఎరోస్ సంస్థ విడుదల చేయడానికి కృషి చేస్తుందని నిర్మాత వెంకటేష్ వ్యాఖ్యానించారు.

డిసెంబర్ 12న రజినీకాంత్ బర్త్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల ఆడియో విడుదల కార్యక్రమం నవంబర్ 16న చెన్నైలో జరగనుంది. ఆ రోజే ట్రైలర్ కూడా అభిమానులకు చూపిస్తారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. సుమారు 170 కోట్లకు ఎరోస్ సంస్థ ‘లింగ’ హక్కులను సొంతం చేసుకుందని చెన్నై మీడియా టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు