దాసరి నారాయణరావు గారు తెరకెక్కించిన ‘ఎర్రబస్సు’ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ పనులను ముగించుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ సంపాదించుకుంది
ఈ సినిమాలో విష్ణు, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలు పోషించారు. కేథరీన్ త్రేస హీరోయిన్. మంజాపై అనే తమిళ చిత్రానికి ఈ ఎర్రబస్సు రీమేక్. ఈ చిత్రం నవంబర్ 14న మనముందుకు రానుంది


