“నా సామిరంగ” నుండి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే సాంగ్ రిలీజ్!

“నా సామిరంగ” నుండి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే సాంగ్ రిలీజ్!

Published on Dec 10, 2023 1:30 PM IST

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి లో సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రేజీ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం లో అషికా రంగనాథ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది.

ఈ చిత్రం నుండి తాజాగా ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన పాటకి చంద్రబోస్ లిరిక్స్ రాయగా, రామ్ మిరియాల గాత్రం అందించారు. ఈ సాంగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. మాస్ గెటప్ లో మరోసారి కింగ్ నాగార్జున చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు