ఈ టీవీ చేతికి ‘బాహుబలి’ శాటిలైట్ రైట్స్

baahubali11

‘బాహుబలి’ – గత 17 రోజులుగా బాక్స్ ఆఫీసు వద్ద సెన్సేషన్ సినిమా.. టాలీవుడ్ జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ కి తెలుగు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెండు విభిన్న పాత్రలు పోషించిన ఈ సినిమాలో రానా విలన్ గా కనిపించాడు. అన్ని ఏరియాల వారీగా వస్తున్న రికార్డ్స్ ని పక్కన పెడితే, రిలీజ్ అయిన నాటి నుంచి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి టాప్ టీవీ చానల్స్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి.

మా టీవీ వారు 13 కోట్లు ఆఫర్ చేస్తే, జీ తెలుగు వారు 15 కోట్లు ఆఫర్ చేసారు. కానీ ఎంతో క్రేజ్ ఉన్న ఈ బాహుబలి సినిమా శాటిలైట్ రైట్స్ ఫైనల్ గా ఈటీవీ వారికి సొంతం అవ్వనున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ టీవీకి బాహుబలి శాటిలైట్ రైట్స్ ఇవ్వడానికి అంగీకరించారు. బాహుబలి సినిమా షూటింగ్ 80% షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది, ఈ సినిమా కోసం రామోజీరావు ఎంతో హెల్ప్ చేసారు.. దాంతో ఈటీవీ వారు శాటిలైట్ రైట్స్ అడగగానే ఆర్కా వారు కూడా ఓకే చెప్పేశారని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version