ఈటీవీ విన్‌లో ’96’ ఫేమ్ గౌరీ కిషన్ ఎంటర్టైనర్ ‘లిటిల్ మిస్ నైనా’

ఈటీవీ విన్‌లో ’96’ ఫేమ్ గౌరీ కిషన్ ఎంటర్టైనర్ ‘లిటిల్ మిస్ నైనా’

Published on Jan 25, 2024 8:00 AM IST

మూవీ లవర్స్ లో తమిళ హిట్ చిత్రం “96” (తెలుగులో జాను) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించి, నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ నటి గౌరీ కిషన్ కూడా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉండగా ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “లిటిల్ మిస్ నైనా” ఈటీవీ విన్‌లోకి వచ్చింది.

ఇందులో షేర్షా షెరీఫ్ మెయిన్ లీడ్‌గా నటించారు. నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రత్యేకమైన కథాంశంతో రాబోతోంది. నైనా పొట్టిగా (4 అడుగులు), అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉండటంతో పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా ఉండబోతోంది. అభిజిత్‌కి సినిమా అంటే పెద్ద ప్యాషన్ అయితే, ఓసీడీ సమస్య ఉన్న అమ్మాయికి చదువులంటే ప్రాణం.

ఈ ఇద్దరి మధ్య ప్రేమ కథ ఎలా సాగింది? వచ్చిన సమస్యలు ఏంటి? అనేది ఎంతో వినోదభరితంగా చూపించారు. 96 ఫేమ్ గోవింద్ వసంత అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ల్యూక్ జోస్ కెమెరా, సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్, సుతిన్ సుగతన్ నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 25 నుంచి ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ETV విన్‌లో ప్రసారం అవుతుంది. కాబట్టి మీ ప్రియమైన వారితో కలిసి దీన్ని చూడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు