ట్రైలర్ తో ఆసక్తి పెంచుతున్న ‘యురేక’ !

Published on Mar 4, 2020 9:53 pm IST

కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘యురేక’. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ ఇంట్రస్టింగ్ సాగుతూ సినిమా పై ఆసక్తిని పెంచింది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

కాగా లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకం పై రాబోతున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ తాత నిర్మాతగా లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంతో పాటు లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా కావడంతో సినిమా కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమా పై ఆసక్తి చూపించొచ్చు. మార్చి 13న ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇక డింపుల్ ,షాలినీ, అపూర్వ బ్రహ్మాజీ ,రఘుబాబు తదితరులు నటిస్తొన్న చిత్రానికి నరేష్ కుమరన్ సంగీతం అందిస్తుండగా డిఓపిగా ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటర్ గా గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి. పని చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More