సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న “ఎవడు తక్కువకాడు”

Published on May 21, 2019 1:22 pm IST

నిర్మాత లగపాటి శ్రీధర్ తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ ని హీరో పరిచయం చేస్తూ స్వయంగా నిర్మిస్తున్న మూవీ “ఎవడు తక్కువకాడు”. తమిళంలో ఘనవిజయం సాధించిన “గోలి సోడా” మూవీకి అనువాదమే “ఎవడు తక్కువకాడు”. స్వయంగా ఎదగాలని ఆరాటపడే నిరుపేద యువకులకు ఓ ధనవంతుడికి మధ్య జరిగే ఆధిపత్య పోరే ఈ మూవీ కథగా తెలుస్తుంది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. మొత్తం మూవీ నిడివి 125 నిమిషాలు కావడం సినిమాకు కలిసొచ్చే మరో అంశం. రాహుల్ జయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక జైన్ హీరోయిన్ గా చేస్తుండగా, హరి ఘోరా సంగీతం అందించారు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఎవడు తక్కువకాడు” మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్ధమైంది.

సంబంధిత సమాచారం :

X
More