తారక్ రేపే రివీల్ చేయనున్నాడు

Published on Mar 13, 2021 1:00 am IST

యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు టీవీ షోలకు కూడ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లి తెర మీద కూడ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరొక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. అదే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ విషయాన్ని రేపే అధికారికంగా ప్రకటించనున్నారు. రేపు జెమినీ మ్యూజిక్ ఛానెల్ నందు 11 గంటలకు లైవ్ కార్యక్రమం ద్వారా ఈ షోను ప్రకటించనున్నారు. తారక్ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో షో ప్రోమోను కూడ రిలీజ్ చేయనున్నారు. దీంతో తారక్ ఖాతాలో ఇంకొక టీవీ పడనుంది. ఇకపోతే తారక్ ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. అది పూర్తవగానే ఎవరితో సినిమా చేస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆయన జాబితాలో ప్రశాంత్ నీల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం :