అడివి శేషు థ్రిల్లింగ్ హిట్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో

అడివి శేషు థ్రిల్లింగ్ హిట్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో

Published on Sep 16, 2019 11:47 PM IST

యంగ్ హీరో అడివి శేషు ఎవరు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధించి నిర్మాతలతో పాటు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పంట పండించింది. ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని మలుపులతో తెరకెక్కిన ఎవరు చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల విశేష ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హీరో అడివి శేషు, రెజినా కాసాండ్రా అద్భుత నటనతో అలరించారు.

కాగా ఈ థ్రిల్లింగ్ హిట్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. వెండి తెరపై ఈ ఎవరు చూడలేని వారు, అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రాన్ని చూసి ఆనందించవచ్చు. నిర్మాత పరం వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా,శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. నవీన్ చంద్ర,మురళి శర్మ కీలక పాత్రలు చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు