అందరూ రష్మిక లక్ గురించే మాట్లాడుకుంటున్నారు !

Published on May 31, 2019 11:23 am IST

తెలుగు పరిశ్రమలో నటనతో మెప్పించే హీరోయిన్లకు అవకాశాలకు లోటుండదు. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా వస్తుంటాయి. ఇక వాళ్ళు యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకోగలిగితే అనతి కాలంలోనే స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి లక్కే రష్మిక మందన్నకు దక్కింది. మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఈమె కథానాయిక.

నిన్నటి వరకు ఒక గాసిప్ మాదిరిగానే ఉన్న ఈ వార్త ఈరోజు కన్ఫర్మ్ అయింది. రష్మిక కూడా మహేష్ బాబుతో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైట్ అవుతోంది. గత ఏడాదే పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ అమ్మాయి ఈ ఏడాదిన్నర కాలంలో చేసింది రెండు సినిమాలే. వాటిలో రెండవ చిత్రం ‘గీత గోవిందం’ అద్భుతమైన సక్సెస్ కావడంతో యువతలో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రేజ్ వలనే మహేష్ సరసన నటించే అవకాశాన్ని చాలా త్వరగానే అందుకుంది. ఈ వార్త తెలిసిన వారంతా రష్మిక భలే లక్కీ కదా అని కొంచెం ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More