త్రివిక్రమ్ నెక్స్ట్ పై అందరిలో ఆసక్తి ?

త్రివిక్రమ్ నెక్స్ట్ పై అందరిలో ఆసక్తి ?

Published on Jan 24, 2024 12:19 AM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ తెరకెక్కించారు.

రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

ఇక దీని అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ ఏ హీరోతో వర్క్ చేయనున్నారు అనేది టాలీవుడ్ ఆడియన్స్ లో ఆసక్తికరంగా మారింది.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం రామ్, నాని లలో ఒకరితో ఆయన వర్క్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియన్ మూవీని అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. కాగా త్రివిక్రమ్ నెక్స్ట్ పై పక్కాగా క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు