మళ్ళీ మన ముందుకు రాబోతున్న ఈవీవీ సినిమా

మళ్ళీ మన ముందుకు రాబోతున్న ఈవీవీ సినిమా

Published on Nov 22, 2011 4:16 PM IST


పాపులర్ డైరెక్టర్ ఈఈవీ సత్యనారాయణ గారి హోం బ్యానర్ ఈవీవీ సినిమా పై ఓ చిత్రం నిర్మించనున్నట్లు ఈవీవీ గారి అబ్బాయి అల్లరి నరేష్ చెప్పారు. తన తండ్రి గారు చనిపోయాక ఒక చిత్రాన్ని తీసి వారికి అంకితమివ్వాలని తాను మరియు ఆర్యన్ రాజేష్ నిర్ణయించుకున్నట్లు నరేష్ తెలిపారు.

వీరిద్దరూ కలిసి నిర్మించబోయే మొదటి చిత్రం ఇదే. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక ప్రముఖ హీరోని సంప్రదించినట్లు, వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రాన్ని ప్రారంబిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత ఆర్యన్ రాజేష్. త్వరలో ఈ చిత్ర విషయాలు తెలియచేస్తామని అల్లరి నరేష్ అన్నారు.

గతంలో ఈవీవీ సినిమా నుండి చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ఈ బ్యానర్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి విజయవంతమైన చిత్రాలు సాధించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు