పవన్ కళ్యాణ్ సినిమా రికార్డ్ సృష్టిస్తోంది !

పవన్ కళ్యాణ్ సినిమా రికార్డ్ సృష్టిస్తోంది !

Published on Oct 22, 2018 10:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ.. ‘అజ్ఞాతవాసి’ మాత్రం ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎప్పుడో విడుదలైన సినిమా ఇప్పుడు రికార్డ్ లు సృష్టించడం ఏమిటి అనుకుంటున్నారా ? ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని హిందీ భాషలోకి డబ్ చేసి విడుదల చెయ్యడం జరిగింది.

కాగా ‘అజ్ఞాతవాసి’ హిందీ వెర్షన్ కేవలం 24 గంటల్లోనే 9.6 మిలియన్ల వ్యూస్ ను సాధించి సరి కొత్త రికార్డ్ ని నెలకొల్పింది. మొత్తానికి అత్యధిక వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ నిలవడం విశేషం. గతంలో ఈ రికార్డ్ తమిళ్ స్టార్ హీరో అజిత్ ‘వివేగం’ చిత్రం పేరు మీద ఉండేది. ప్రస్తుతం పవన్ చిత్రం పేరు మీద మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు