సూర్య “కంగువ” టీజర్ కి ఎక్సలెంట్ రిపోర్ట్స్.!

సూర్య “కంగువ” టీజర్ కి ఎక్సలెంట్ రిపోర్ట్స్.!

Published on Feb 22, 2024 10:59 AM IST

తమిళ నాట అలాగే మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న స్టార్ హీరోస్ లో సూర్య కూడా ఒకరు, మరి సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే “కంగువ”. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా ఈ ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఈ చిత్రానికి సాలిడ్ ప్లస్ గా మారింది. ఇక ఇది వరకే సినిమా గ్లింప్స్ బయటకి రాగా దర్శకుడు ఒక మాసివ్ విజువల్ ట్రీట్ ని అయితే ప్రామిస్ చేసాడు.

మరి లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ గ్లింప్స్ ని మేకర్స్ కొందరు ప్రముఖులు వీక్షించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి అయితే ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇప్పుడు బయటకి వచ్చింది. సినిమాలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అలాగే సూర్య సహా ఇతర మెయిన్ కాస్ట్ అంతా కూడా సినిమాలో ఆశ్చర్యపరచడం గ్యారెంటీ అని అంటున్నారు. మొత్తానికి అయితే ఈ భారీ చిత్రానికి రిపోర్ట్స్ మాత్రం ఆసక్తిగానే ఉన్నాయి. ఇక ఈ టీజర్ లాంచ్ కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు