నాగార్జునకు స్వాగతం పలికిన నాని !

4th, April 2018 - 05:13:41 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని నటిస్తోన్న సినిమా సెకండ్ షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈరోజు నాగార్జున ఈ సినిమా సెట్స్ లో పాల్గొనడం జరిగింది. నాని ఈ సందర్భంగా నాగార్జునకు సెట్స్ లోకి స్వాగతం పలికారు. నాగార్జునగారు షూటింగ్ కు హాజరుకావడం ఆసక్తికరంగా ఉందని ట్విట్టర్ లో తెలిపాడు నాని.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నాని ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు, అలాగే నాగార్జున డాన్ పాత్రలో అలరించబోతున్నాడు. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ నెల 12 న విడుదల కానుంది.