“వార్ 2” లో ఎన్టీఆర్ రోల్ పై ఎగ్జైటింగ్ ఇన్ఫో.!

“వార్ 2” లో ఎన్టీఆర్ రోల్ పై ఎగ్జైటింగ్ ఇన్ఫో.!

Published on Mar 5, 2024 4:57 PM IST

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తారక్ సెన్సేషనల్ లైనప్ ని సెట్ చేసుకోగా ఈ చిత్రాల్లో తన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ హీరో హృతిక్ రోషన్ పై వచ్చిన బజ్ అందరిలో ఆసక్తి రేపింది.

మరి ఈ సినిమాలో హృతిక్ తో పాటుగా తారక్ కూడా సాలిడ్ రోల్ లో నటిస్తుండగా ఇప్పుడు తన పాత్రకి సంబంధించి ఎగ్జైటింగ్ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని మాత్రం మంచి పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట.

ఇపుడు వరకు యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో వచ్చిన ఏజెంట్స్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా ఓ ఇండియన్ ఏజెంట్ గా కనిపించనున్నాడని తన కోసం సెపరేట్ ట్రాక్ ని ప్లాన్ చేస్తున్నారని అంతే కాకుండా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలాంటి విలన్ కూడా కాదని హృతిక్ తో కలిసి విలన్ ని ఎదుర్కొనే సమాన పాత్రలో తాను కనిపిస్తాడని బాలీవుడ్ చెప్తున్నాయి.

అలాగే తారక్ రోల్ వీరి స్పై యూనివర్ నుంచి వచ్చే మరిన్ని చిత్రాల్లో కనిపించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి అయితే బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ మామూలు లెవెల్లో ఉండేలా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు