ప్రభాస్ ‘స్పిరిట్’ పై క్రేజీ న్యూస్ !

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమా అప్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ లో ప్రభాస్ తో పాటు మిగిలిన తారాగణం అంతా పాల్గొంటారట.

కాగా ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.

Exit mobile version