ప్రత్యేకం : బాహుబలి బడ్జెట్ 175 కోట్లు దాటనుందా.!

ప్రత్యేకం : బాహుబలి బడ్జెట్ 175 కోట్లు దాటనుందా.!

Published on Jun 30, 2014 4:50 PM IST

bahubali-first-look

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఇండియాలోనే మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ సినిమా తీస్తున్నారని మనకు తెలుసు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అని, కొంతమంది ఏమో 150 కోట్లు ఉంటుందని అంటున్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి బాహుబలి బడ్జెట్ అంతకన్నా ఎక్కువ అవుతోంది.

‘బాహుబలి’ ప్రొడక్షన్ టీంతో బాగా క్లోజ్ గా పనిచేసే కొంతమంది చెప్పిన దాని ప్రకారం బాహుబలి బడ్జెట్ 175 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని రెండు పార్ట్స్ గా తీస్తుండడం, అదికూడా పలు భాషల్లో తీస్తుండడం వల్ల బడ్జెట్ ఈ రేంజ్ లో అవుతోందని అంటున్నారు. అలాగే తెలుగు రిలీజ్ కంటే తమిళ్ రిలీజ్ భారీగా, ఎక్కువ థియేటర్స్ లో ఉంటుందని సమాచారం.

సినిమా రెండు పార్ట్స్, ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్, స్టార్ నటీనటులు, సినిమాపై ఉన్న క్రేజ్ ని బట్టి ఈ చిత్ర నిర్మాతలు ఆ రేంజ్ బడ్జెట్ ని ఈజీగా రికవర్ చేయొచ్చని అనుకుంటున్నారు. మేము ఇదివరకే చెప్పినట్టు హాలీవుడ్ మూవీస్ అయిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘అవెంజర్స్’ సినిమాలకి పనిచేసిన టెక్నికల్ టీం ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం పనిచేస్తోంది. ఈ సినిమాలో వచ్చే ఓ వార్ సీక్వెన్స్ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2015 సమ్మర్లో ప్రేక్సహ్కుల ముందుకు రానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు