ప్రత్యేకం : స్టార్స్ డిన్నర్ నైట్ కి రానున్న కామెడీ నైట్స్ కపిల్

ప్రత్యేకం : స్టార్స్ డిన్నర్ నైట్ కి రానున్న కామెడీ నైట్స్ కపిల్

Published on Nov 7, 2014 11:00 AM IST

kapil-sharma
హుదూద్ బాధితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నవంబర్ 30న ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుక కంటే ముందు రోజు అనగా నవంబర్ 29న స్టార్స్ తో కలిసి డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ స్టార్స్ డిన్నర్ కి 250 కపుల్స్ రానున్నారు. ఈ స్టార్స్ నైట్ డిన్నర్ కి అటెండ్ అవ్వాలంటే వారి ఎంట్రీ ఫీజు లక్ష రూపాయలని కూడా తెలియజేశాం.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ డిన్నర్ కి వచ్చే స్టార్స్ మరియ 250 కపుల్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం కోసం కొన్ని పోర్గ్రామ్స్ కూడా చేయనున్నారు. అందులో భాగంగా ఇండియాలో కామెడీ నైట్స్ తో బాగా ఫేమస్ అయిన కపిల్ ఈ స్టార్ నైట్ డిన్నర్ కి యాకర్ గా వ్యవహరించి అక్కడికి వచ్చే వారిని ఎంటర్టైన్ చేయనున్నాడు. అలాగే ఇదే కార్యక్రమంలోనే శృతి హాసన్ కూడా తన మ్యూజిక్ బ్యాండ్ తో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఈ వేడుక నవంబర్ 29న జె.ఆర్సి కన్వెన్షన్ హాల్ లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు