తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా యంగ్ హీరోస్ అంతా కలిసి స్టార్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని మీకు ఇది వరకే తెలియజేశాం. ఈ క్రికెట్ మ్యాచ్ లో నాలుగు టీం ఉంటాయని, ప్రతి ఒక్క టీంలో 6 మంది ప్లేయర్స్ ఉంటారని తెలియజేశాము. అలాగే అనుష్క టీంలో 5 మంది హీరోయిన్స్ మరియు అఖిల్ ఆడనున్నాడని తెలియజేశాం. కానీ తాజాగా ఈ నాలుగు తీంస్ లో చిన్న మార్పులు చేసారు.
హీరోయిన్స్ ని మాత్రమే ఒక టీంగా చేస్తే మిగతా టీమ్స్ వీరిపై ఈజీగా గెలిచేస్తారనే ఉద్దేశంతో క్రికెట్ యాజమాన్యం టీమ్స్ లో చిన్న చిన్న మార్పులు చేసారు. ఒకే టీంలో 5 మంది హీరోయిన్స్ ని ఉంచకుండా, ప్రతి టీంలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా టీమ్స్ ని షార్ట్ లిస్టు చేస్తున్నారు. అంటే 6 మంది ఉండే ఒక టీంలో నలుగురు హీరోలు ఉంటే, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇలాంటి కలర్ఫుల్ క్రికెట్ మునుపెన్నడూ జరగలేదు. త్వరలోనే పూర్తి టీం వివరాలను తెలియజేస్తాం. మరో సారి టీమ్స్ వివరాలు..
1. ఎన్.టి.ఆర్ టీం
2. రామ్ చరణ్ టీం
3. బాహుబలి టీం
4. అనుష్క టీం (అనుష్క టీంలో అఖిల్ మెయిన్ ప్లేయర్ గా ఆడనున్నాడు)
ఈ మ్యాచ్ కి సంబందించిన టికెట్స్ ని బుక్ మై షో ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ని ప్రారంభించనున్నారు. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగానే మీ టికెట్స్ ని బుక్ చేసుకొని నవ,బార్ 30న ఈ స్టార్స్ మ్యాచ్ ని ఎంజాయ్ చెయ్యండి.


