ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఎడిటర్ నాగేశ్వర రెడ్డి బొంతల: నేను, వేణు ఊడుగులు చాలా కష్టలు పడ్డాం !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఎడిటర్ నాగేశ్వర రెడ్డి బొంతల: నేను, వేణు ఊడుగులు చాలా కష్టలు పడ్డాం !

Published on Mar 29, 2018 10:00 AM IST

వేణు ఊడుగుల దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘నీది నాది ఒకే కథ’ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా ఎడిటర్ గా పరిచయం అయిన నాగేశ్వర రెడ్డి బొంతలతో స్పెషల్ ఇంటర్వ్యూ…

ప్ర) సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ)మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మేము ఇంతటి ఆదరణ లభిస్తుందని అనుకోలేదు. సినిమా విడుదల తరువాత రెండు రాష్ట్రాల్లో కలిపి 70 థియేటర్స్ పెరిగాయి.

ప్ర)ఎడిటింగ్ కు ఎలాంటి ఆదరణ లభిస్తోంది ?
జ)సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది ఫ్రెండ్స్ , సినీ పరిశ్రమ వ్యక్తులు ఎడిటింగ్ బాగుందని మెసేజ్ చేసారు. ముఖ్యంగా డైరెక్టర్ మదన్ నా వర్క్ ను అభినందించడం మర్చిపోలేనిది.

ప్ర) సినిమా నిర్మాణంలో ఎంటువంటి శ్రద్ద చూపించడం జరిగింది ?
జ)రెగ్యులర్ సినిమాలకు వర్క్ చేయడం సులభం కాని డ్రామాను తెరకెక్కించడం కొంతవరుకు కష్టం. ఈ సినిమా విషయంలో చాలా సన్నివేశాలు లెన్త్ ఎక్కువగా ఉందని తొలగించడం జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో తన తండ్రికి గొడుగు పట్టే సన్నివేశంలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. కాని సినిమా ఫ్లో దెబ్బతినకుండా కట్ చెయ్యడం జరిగింది.

ప్ర)సినిమా రన్ టైం ఎందుకు రెండు గంటల ఒక నిమిషం మాత్రమే ఉంది ?
జ) మా సినిమా కమర్షియల్ ఫార్మాట్లో లేదు. ఈ సినిమాకు రన్ టైం అంత ఉండడమే కరెక్ట్ అని నా ఫీలింగ్.

ప్ర)వేణు ఊడుగుల తో మీ అనుభవాలు చెప్పండి.
జ)నేను, వేణు బాగా ఇబ్బందులు పడ్డాం. ఖాళీ సమయాల్లో కథల గురించి చర్చించుకొనే వాళ్ళం. ఇప్పుడు కొంత వరుకు సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది.

ప్ర)మీ నైపథ్యం గురించి చెప్పండి ?
జ)నాది కర్నూల్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. వినాయక్ గారి దగ్గర తెలిసిన వారి సహాయంతో ప్రసాద్ ల్యాబ్ లో డి.ఐ వర్క్ చెయ్యడానికి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తరువాత గౌతంరాజు దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా వర్క్ చేసాను. మోహన్ బాబు కంపెనీలో కొంతకాలం పాటు వర్క్ చెయ్యడం జరిగింది. తరువాత వేణు సినిమాతో ఎడిటర్ గా పరిచయం అయ్యాను.

ప్ర)శ్రీ విష్ణు మరియు నిర్మాతలతో వర్క్ చెయ్యడం ఎలా అనిపించింది ?
జ)సినిమా చేస్తున్న సమయంలో వారి సహాయం మర్చిపోలేనిది. నిర్మాత కృష్ణ విజయ్, ప్రశాంతి మేడమ్ బాగా సహకరించారు. అలాగే మా డైరెక్షన్ టీమ్ ఉమేష్, అక్షర కుమార్, చారి, నారాయణ మూర్తి, శ్రీను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కలిసికట్టుగా పనిచేశాం.

ప్ర)మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
జ) ఇప్పటికి ఏది ఖరారు కాలేదు. చర్చల దశలో ఉన్నాయి. త్వరలో అన్ని వివరాలు తెలుపుతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు