ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : చాందిని చౌదరి – జూనియర్ ఎన్టీఆర్ గారే నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : చాందిని చౌదరి – జూనియర్ ఎన్టీఆర్ గారే నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ !

Published on Apr 28, 2020 1:54 PM IST

లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ ను కొనసాగిస్తూ, ఈ రోజు, అందమైన మరియు ప్రతిభావంతులైన తెలుగు నటి చాందిని చౌదరితో ప్రత్యేక ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాము. లఘుచిత్రాలలో నటించిన చాందిని, కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. మరి చాందిని తన కెయిర్ గురించి చెప్పిన విశేషాలేమిటో చూద్దాం.

 

లాక్ డౌన్ విధించే సమయంలో మీరు ఏ సినిమాలు చేస్తున్నారు?

లాక్ డౌన్ కు ఒక వారం ముందు నాకు చికెన్ పాక్స్ వచ్చింది. దాని కారణంగా, నేను అప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అప్పటికే నేను చాలా బలహీనంగా ఉన్నందున ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. అయితే లాక్ డౌన్ కి ముందు సుహాస్‌తో కలిసి ‘కలర్ ఫోటో’ షూటింగ్‌ చేసాను.

 

తెలుగు సినిమాల్లో ఎందుకు మీరు ఎక్కువగా కనిపించడం లేదు ?

నేను హైదరాబాద్‌లో లేకపోవడం వల్లనేమో. నేను నా తల్లిదండ్రులతో వైజాగ్‌లోనే ఉంటున్నాను. మా తల్లిదండ్రులకు నేను ఏకైక సంతానం. వారిని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మొదటి నుండి నా దగ్గరికి వస్తోన్న క్యారెక్టర్స్ ను నాకు నచ్చిన క్యారెక్టర్స్ నే మాత్రమే చేస్తున్నాను.

 

‘మను ‘ సినిమా పెద్దగా ఆడకపోయినా, ఆ సినిమాలో మీ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి ?

అవును. నాకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ క్రెడిట్ నేను మా దర్శకుడికే ఇస్తాను. తను నాకు కథను వివరించిన విధానం, నా పాత్రను మలిచిన విధానం చాలా బాగుంది. నాకు నటించడానికి మంచి స్కోప్ వచ్చింది.

 

ఓటిటీలో వెబ్ సిరీస్ లు చేస్తోంది మూవీ ఆఫర్స్ లేకపోవడం వల్లనేనా… ?

అలాంటిదేమీ లేదు. ఓటిటీ అనేది ప్రస్తుతం భూమ్ లో ఉంది కదా. రాబోయే సంవత్సరాల్లో, ప్రతి ఒక్కరూ ఓటిటీలో యాక్ట్ చేస్తారు. మొదట గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో నాకు ఆఫర్ వచ్చినప్పుడు, వెబ్ సిరీస్ లో చేస్తే సినిమా ఆఫర్లు తగ్గుతాయని చాలా మంది చెప్పారు, కాని నా చేతిలో ఇప్పుడు మంచి సినిమాలే ఉన్నాయి.

 

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు?

జూనియర్ ఎన్టీఆర్ గారే నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ . ఆయన సూపర్ టాలెంటెడ్ మరియు అద్భుతమైన వ్యక్తి కూడా. బిగ్ బాస్ చూసిన తరువాత ఆయన వ్యక్తిత్వానికి పెద్ద అభిమానిని అయ్యాను. నేను ఏదో ఒక రోజు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయాలని ఆస పడుతున్నాను.

 

మీలాంటి ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా?

ఒక విధంగా అవుననే చెప్పాలి. అయితే నేను నా కెరీర్‌లో చాలా దూరం వచ్చాను. కానీ నాలాంటి తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకపోతే.. వారికీ మంచి పాత్రలు ఇవ్వకపోతే తమ నటనా సామర్థ్యాన్ని ఎలా చూపించగలరు. అందరికీ అవకాశాలు ఇస్తే బాగుంటుంది.

 

లాక్ డౌన్ లో మీరు ఏమి చేస్తున్నారు?

నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం పెయింటింగ్ వేస్తున్నాను, అలాగే చాలా పుస్తకాలు చదువుతున్నాను. నటిగా నన్ను బాగా తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగే, నా స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకోవాలో అని స్క్రిప్ట్ గురించి కూడా చదువుతున్నాను.

 

మీ భవిష్యత్ ప్రాజెక్టులు?

ప్రస్తుతం కలర్ ఫోటో సినిమా చేస్తున్నాను. ఇది 90ల కాలంలోని ప్రేమకథ. అలాగే విశ్వక్ సేన్ తో కూడా ఓ సినిమా చేశాను. షూటింగ్ కూడా దాదాపు అయిపొయింది. అలాగే ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌లో కూడా చాలా ఆఫర్‌లు ఉన్నాయి, లాక్‌ డౌన్ ముగిసిన తర్వాత ఏవి యాక్సెప్ట్ చేయాలో నిర్ణయించుకుంటాను. అంటూ చాందిని ఇంటర్వ్యూను ముగించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు