ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాఠి – నాగ్ సర్ సపోర్ట్ అద్భుతమైనది !

Published on Apr 30, 2020 9:46 pm IST

లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ ను కొనసాగిస్తూ, ఈ రోజు, అందమైన మరియు ప్రతిభావంతులైన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రత్యేక ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాము. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. మరి లావణ్య త్రిపాఠి తన కెయిర్ గురించి చెప్పిన విశేషాలేమిటో చూద్దాం.

 

ఈ లాక్ డౌన్ వ్యవధిలో మీరు ఏమి చేస్తున్నారు?

లాక్ డౌన్ కి ముందు నేను నాన్‌స్టాప్ షూటింగ్ చేస్తున్నందున నా స్వస్థలానికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ హైదరాబాద్‌లోనే ఇరుక్కుపోయాను. కాబట్టి, నేను ఒంటరిగా ఉన్నాను. అందరి లాగే మూవీస్ అండ్ షోస్ తో టైం పాస్ చేస్తున్నా.

 

అర్జున్ సువరం ముందు, మీ కెరీర్ డౌన్ లో ఉంది. ఆ సమయంలో మీకు ఎవరు ఎక్కువ మద్దతు ఇచ్చారు?

నా కుటుంబమే నాకు అతి పెద్ద మద్దతు. ముఖ్యంగా నా సోదరి, నా వెనుక ఉండి నన్నెప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. నేను తనతోనే ప్రతిదీ చర్చిస్తాను. మంచి సలహాలు ఇస్తోంది.

 

మీరు కొన్ని సినిమాలను అవగాహన లేకుండా ఎంచుకున్నారట ?

అవును. అయితే నేను ఆ సినిమాలు చేయటానికి నేనే బాధ్యత వహిస్తాను, కొన్ని పరిస్థితుల వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల నేను కొన్ని ప్లాప్ సినిమాలు చేయాల్సి వచ్చింది. అయితే అవి నాకు సరైన నిర్ణయాలను తీసుకోవటానికి పనికొచ్చాయి.

 

మీరు గ్లామరస్ రోల్ చేస్తారా ? బికినీ ధరించే పాత్ర చేస్తారా?

పాత్రను బట్టి అల చేయాల్సి వస్తే చెయ్యొచ్చు. కానీ, ఎదో గ్లామర్ కోసం అని బోల్డ్ సన్నివేశాలు చేయడం మరియు బికినీ ధరించడం లాంటివి నాకు ఇష్టం లేదు, సన్నివేశాలు మరియు స్క్రిప్ట్‌లో డిమాండ్ ఉండాలి. అల ఉంటే చేస్తాను.

 

మీ ఫిల్మ్ ఫ్లాప్ అని తెలిసినప్పుడు మీరు ఎలా మ్యానేజ్ చేస్తారు ?

ఈ రోజుల్లో, సినిమా విడుదలైన గంటలోనే ఫలితం తెలుస్తుంది. నేను కొంతమంది విమర్శకులను అనుసరిస్తాను వారు సినిమా గురించి ఏమి చెప్పారో చూస్తాను. నేను నిర్మాణాత్మక విమర్శలను తీసుకుంటాను.

 

ఎలాంటి విమర్శలను తీసుకున్నారో ఒక్కటి ఉదాహరణగా చెప్పగలరా ?

కొన్ని సినిమాల్లో నా మేకప్ బాగాలేదని చాలా మంది విమర్శించారు. అది నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. నేను కూడా మేకప్ బాగాలేదని గమనించాను, ఆ తరువాత నా మేకప్ ను సరి చేసుకున్నాను. నేను ఎప్పుడూ తప్పుల నుండి నేర్చుకుంటాను. చేసిన తప్పులను మళ్ళీ ఎప్పుడూ పునరావృతం చేయను.

 

మీ కుటుంబం నుంచి కాకుండా పరిశ్రమలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు ?

నాగ్ సార్‌.. ఆయనతో కలిసి వర్క్ చేస్తోన్నప్పుడు ఆయన నాకు మద్దతు ఇచ్చిన విధానం అద్భుతమైనది. నా జీవితంలో ఏదైనా ప్రధాన సూచన కావాలంటే.. నేను ఇప్పటికీ నాగ్ సర్ నే అడుగుతాను. ఆయన నుండి నాకు గొప్ప మద్దతు ఉంది.

 

మీకు ఇష్టమైన నటుల గురించి?

శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్ నాకు చాలా ఇష్టమైన నటులు. వాళ్ళ సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. అలాగే రణబీర్ అన్నా కూడా చాలా ఇష్టం. ఇక ఆయుష్మాన్ ఖురన్న నటన చాల బాగుంటుంది.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

నాకు నెక్స్ట్ సినిమాల గురించి అంటే.. మంచి లైనప్ ఉంది. ఏ1 ఎక్స్‌ప్రెస్ పూర్తీ అవుతొంది. ఈ చిత్రం పై పూర్తి నమ్మకం ఉంది. అలాగే అధర్వ, కార్తికేయ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. అలాగే మరో తమిళ చిత్రం కూడా చేస్తున్నాను. అంటూ లావణ్య ఇంటర్వ్యూ ముగించింది.

సంబంధిత సమాచారం :

X
More