ప్రత్యేక ఇంటర్వ్యూ : మహి – అందమైన రోడ్ జర్నీనే ‘పాఠశాల’

ప్రత్యేక ఇంటర్వ్యూ : మహి – అందమైన రోడ్ జర్నీనే ‘పాఠశాల’

Published on Jun 15, 2014 7:12 PM IST

mahi
‘వినాయకుడు’ సినిమా ద్వారా రైటర్ గా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాల ద్వారా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మహి త్వరలో రానున్న ‘పాఠశాల’ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 5 మంది ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే ఈ సినిమా గురించి పలు విశేషాలను డైరెక్టర్ మహి మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం.

ప్రశ్న) రైటర్ నుంచి డైరెక్టర్ వైపు మీ ప్రయాణం ఎలా సాగింది?

స) నేను ‘వినాయకుడు’ సినిమాకి రైటర్ గా, నిర్మాతగా పనిచేసాను. అలాగే విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలకు నిర్మాతగా చేసాను. నేను రైటర్ నుంచి డైరెక్టర్ అవుదాం అని కెరీర్ ప్రారంభించాను. వినాయకుడితో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన నేను స్వతహాగా బిజినెస్ మాన్ అవడం వల్ల ఫోర్స్ మీద నిర్మాతగా మారాను. ఒక కొత్త ఫిల్మ్ మేకర్ కి లిమిట్స్ ఉంటాయి. అందుకే నేను ఈ 6 సంవత్సరాలు స్టార్ హీరోల కోసం తిరగలేదు, నా సొంత సినిమాకి ఫండ్స్ వచ్చేలా చేసుకున్నాను. ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు ఎదురు చూసాను. ఎందుకంటే పర్సనల్ అండ్ ఫ్రెష్ స్టొరీతో సినిమా చేయాలనుకున్నాను. మీరొక స్టొరీ టెల్లర్ కావాలనుకుంటే స్టార్స్ లేకుండా చెప్పండి. అలా చెబితే సినిమా పెద్ద హిట్ కాకపోయినా మీకు మాత్రం లాంగ్ లైఫ్ ఉంటుంది.

ప్రశ్న) ఎందుకు మీరు ఈ సినిమాకి ఇంత టైం తీసుకున్నారు?

స) నా గత సినిమాల రిలీజ్ తర్వాత నాకు అర్థమైంది నాకు స్క్రిప్ట్ రాయడంలో క్లారిటీ లేదని. మేము వేరే వాళ్ళ స్టొరీలు విని సినిమాలు చేస్తున్నాం. ఆ సినిమాల ఫలితం వల్ల మాకు సినిమాని నిర్మించగల కెపాసిటీ లేదని తెలిసింది. దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇంగ్లాండ్ వెళ్ళి 9 నెలలు ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత వచ్చి గత సంవత్సరం ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించాం.

ప్రశ్న) ‘పాఠశాల’ గురించి చెప్పండి.?

స) పాఠశాల అంటే ఓ విషయాన్ని గురించి నేర్చుకునే స్థలం. ఈ పాఠశాల సినిమా తమ సొంత ప్రదేశానికి వెళ్ళే ఐదుగురి చుట్టూ తిరుగుతుంది. ఇదొక రోడ్ సినిమా. కాంపస్ బౌండరీస్ దాటిన ఫ్రెండ్ షిప్ గురించి ఈ సినిమాలో చూపించాం. మామూలుగా కాంపస్ లోపల నాలుగైదు సంవత్సరాల్లో ఏం జరుగుతోంది అనేది మాత్రమే చూపిస్తారు. కానీ ఇందులో ఫ్రెండ్స్ అంతా కలిసి తమ ఫ్రెండ్స్ హోం టౌన్ కి వెళితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ పాయింట్ ని చూపించాం. ఈ సినిమా కాలేజ్ లో గ్రాడ్యువేషన్ మొదలు పెట్టినప్పుడు మొదలవుతుంది. చదువు తర్వాత వారికి ఏమి చెయ్యాలో తెలియకుండానే డిగ్రీ పూర్తి చేసుకొని పట్టా తీసుకుంటారు. వారి స్టడీస్ చివరి రోజు అందరూ కలిసి ప్రతి ఒక్కరి హోం టౌన్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. వారి 16 సంవత్సరాల విద్యాబ్యాసం వారికి ఏమీ నేర్పించదు. ఈ జర్నీలోనే వారు రకరకాల వ్యక్తులను కలుసుకోవడం మరియు జీవితం గురించి తెలుసుకుంటారు.

ప్రశ్న) మీరు కొత్త వారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు.?

స) ఈ మూవీ కోసం ఐదు మందిలో కేరళ నుంచి ఒకరిని, ముంబై నుండి ఒకరిని, హైదరాబాద్ నుంచి ముగ్గురిని సెలక్ట్ చేసాం. వాళ్ళందరూ కొత్త వారు కావడం వల్ల వారికి ఒక నెల వర్క్ షాప్ పెట్టి యాక్టింగ్ పై ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళని ట్రైన్ చేయడంతో పాటు ప్రొడక్షన్ కి 6 నుంచి 7 నెలల సమయం తీసుకున్నాం. ముందుగా మేము రచయితగా నటుడికి తగ్గ పాత్ర ఇవ్వాలి అలాగే వారిని
సెట్లోకి తీసుకెళ్ళాక సరైన గైడెన్స్ ఇచ్చి మనకు కావాల్సింది రప్పించుకోవాలి. అదే ఈ సినిమాకి నటీనటులు వేరే వాళ్ళైతే సినిమా రేంజ్ కూడా డిఫరెంట్ గా ఉండేది.

ప్రశ్న) ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?

స) ఈ సినిమాని జూలై 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేసాం, అలాగే ఈ 45 రోజులు ప్రమోషన్స్ బాగా చేయాలనుకుంటున్నాం. ఇది డైరెక్టర్ గా నాకు తొలి సినిమా లగీ ఇది స్నేహితుల చుట్టూ తిరిగే కథ. ఇలాంటి కథలు చాలా తక్కువగా వస్తుంటాయి. హ్యాపీ డేస్ సినిమా కూడా అలాంటిదే కానీ దాన్లో ఎక్కువ లవ్ స్టొరీ ఉంటుంది. అన్ని రోడ్ జర్నీ సినిమాలు ఒకేలా ఉంటాయి. కానీ పాత్రల్లో మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఈ జర్నీ ఎండింగ్ లోపు ఆ ఫ్రెండ్స్ ఎలా మారారు అనేది చూపించాం. గమ్యం సినిమా కూడా రోడ్ జర్నీ సినిమానే కానీ పూర్తిగా కాదు ఎందుకంటే అందులో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ సినిమా కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకునే సినిమా, తమ గురించి తాము తెలుసుకునే సినిమా, ఇదొక చిన్న టౌన్ స్టొరీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు