ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : పవన్ సాధినేని – ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది

Published on Oct 8, 2020 4:57 pm IST

“ప్రేమ ఇష్క్ కాదల్” అనే చిత్రంతో డీసెంట్ ఎంట్రీ అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు పవన్ సాధినేని. తర్వాత టాలీవుడ్ లో కాస్త డౌన్ అయినా ఆ తర్వాత తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా లో సాలిడ్ వెబ్ సిరీస్ లను తీస్తూ సత్తా చాటారు. అలాగే ఇపుడు బెల్లంకొండ గణేష్ ను టాలీవుడ్ కు పరిచయం చెయ్యనున్నారు. మరి ఈ సందర్భంలో అతనితో ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను తీసుకున్నాము. ఆయన ఎలాంటి విశేషాలు చెప్పారో చూద్దాం రండి.

ముందుగా మీరు బెల్లంకొండ గణేష్ తో చేస్తున్న ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి అవి నిజమేనా?

నేను కూడా అవి విన్నాను, ఇపుడు వాటిని క్లియర్ చేస్తాను. ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం పూర్తయ్యింది. అలాగే ఒక కీ షెడ్యూల్ యూఎస్ లో కూడా ప్లాన్ చేసాం లాక్ డౌన్ తర్వాత అది మొదలవుతుంది. వచ్చే జనవరి లేదా రెండో నెలలో షూట్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నాం.

మరి ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు?

నేను ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ పునర్నవితో ఆహా లో ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశాను. ఈ సిరీస్ పర్మినెంట్ రూమ్ మేట్స్ కు రీమేక్ అది. ఇందులో మొత్తం ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. మంచి యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సిరీస్ వచ్చే నవంబర్ 14 నుంచి అందుబాటులోకి వస్తుంది ఆరోజు కోసం వెయిట్ చేస్తున్నా.

సావిత్రి సినిమా ఎఫెక్ట్ ఎంతలా పడింది?

ఇక సావిత్రి కి వచ్చినట్టయితే ముందు ఒక నటుణ్ని అనుకున్నాను కానీ అది అవ్వలేదు, నారా రోహిత్ తో చేసాను కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం ఆడలేదు. అక్కడ నుంచి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యాను. తర్వాత చాలా మంది నిర్మాతలు నన్ను పట్టించుకోవడం మానేశారు. తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని పలు ప్రాజెక్టులలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశాను

మీరు హరికృష్ణ – కళ్యాణ్ రామ్ లతోఒక సినిమా చెయ్యాలి ఏమయ్యింది అది?

అవును ఆ సినిమా కోసం నేను రెండుళ్లు వర్క్ చేశాను. నిర్మాతగా కళ్యాణ్ రామ్ నాకు చాలా సపోర్ట్ చేసారు. అలాగే ఎన్టీఆర్ అయితే స్రిప్ట్ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. హరికృష్ణ గారి కం బ్యాక్ ను ఇలాంటి ఫాంటసీ చిత్రంతో అని బాగా థ్రిల్ అయ్యారు. కానీ ఊహించని విధంగా హరికృష్ణ గారి అకాల మరణం కలచివేసింది. కానీ కళ్యాణ్ అన్న ఇచ్చిన సపోర్ట్ ను మాత్రం ఎన్నటికీ మర్చిపోను.

ఎందుకు దర్శకులు తమ రెండో సినిమాతో ఫెయిల్ అవుతున్నారు? దానికి కారణం ఏంటి?

నా మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్ తో మంచి వెల్కమ్ ను అందుకున్నాను. కానీ అది నా రెండో సినిమా సావిత్రి కి జరగలేదు. ఒక దర్శకుడు తన మొదటి సినిమాతో తానేంటో నిరూపించుకోనంత మాత్రాన అతను మంచి దర్శకుడు కాదు అని కాదు. అతను ఎంచుకునే కథ, మధ్యలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. నేను ఇండస్ట్రీ వారికి రిక్వస్ట్ చేస్తున్నాను. గతంలో ఒకరు చేసిన సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయి వంటివి చూడొద్దు.

మీరు యూఎస్ లో చదువుకున్నారు, మరి సినిమాల వైపు ఎలా?

నేను నా కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చెయ్యడానికి వెళ్ళాను అక్కడ జాబ్ కూడా వచ్చింది. కానీ ఓరోజు మణిరత్నం గారు తీసిన సఖి సినిమా చూసాను అంతే అది చాలా నచ్చేసింది. ఇక అక్కడ నుంచి సినిమాల పై స్టడీ చేశాను ఆ తర్వాత ఇక సినిమాల్లోకి రావాలి అని ఫిక్స్ అయ్యింది ఇండియాకు వచ్చేసా. అలా వచ్చాక కొన్ని షార్ట్ ఫిల్మ్స్ బెక్కం వేణు గోపాల్ గారి నిర్మాణంలో చేశాను ఆ తర్వాత ఆయనే నా మొదటి సినిమాకు ఆఫర్ ఇచ్చి సురేష్ బాబు గారితో కలిసి నిర్మించారు.

తెలుగు వెబ్ సిరీస్ తీస్తున్న మొదటి వ్యక్తి మీరు, ఇపుడు ఓటిటి స్వింగ్ లో ఉంది మరి మీ వ్యూ ఏంటి?

అవును తెలుగులో నాదే మొట్ట మొదటి వెబ్ సిరీస్ “పిల్లా”. ఇప్పుడు చాలానే మార్పులు వచ్చాయి. అందుకే కొత్త కథలు చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే ప్రముఖ నిర్మాత మరియు రచయిత గుణ్ణం గంగరాజు గారితో ప్రయాణం చెయ్యడం వల్ల చాలా మెళుకువలు నేర్చుకున్నాను. డైలాగ్స్, స్రీన్ ప్లే విషయంలో ఆయనెంతో నేర్పించారు. రాబోయే రోజుల్లో మీరు కూడా నా నుంచి వచ్చే ప్రాజెక్టులను చూసి చెప్తారు ఎలాంటి మార్పులు వచ్చాయో. అంతలా ఆయన నన్ను ప్రభావితం చేశారు.

సో ఇలా ఈ నవ దర్శకుడు పవన్ సాదినేనితో మా ఇంటర్వ్యూ ముగించాము, అలాగే అతని రాబోయే ప్రాజెక్టులకు కు ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నాం.

 

సంబంధిత సమాచారం :

More