ప్రత్యేక ఇంటర్వ్యూ : సాక్షి చౌదరి – నా కెరీర్లో అనుష్క లాంటి సినిమాలు చేయాలి.

ప్రత్యేక ఇంటర్వ్యూ : సాక్షి చౌదరి – నా కెరీర్లో అనుష్క లాంటి సినిమాలు చేయాలి.

Published on Jul 22, 2015 1:28 PM IST

Sakshi-Chowdary
మంచు మనోజ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘పోటుగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అందాల భామ సాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేసిన రెండవ సినిమా ‘జేమ్స్ బాండ్’. కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ వారం అనగా జూలై 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాక్షి చౌదరితో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) జేమ్స్ బాండ్’ మూవీ రిలీజ్ దగ్గరవుతున్న కొద్దీ టెన్షన్ గా ఫీలవుతున్నారా.?

స) కచ్చితంగా నేను టెన్షన్ అయితే పడటం లేదు. సినిమా విజయంపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు ఓపిక తక్కువ, నేను ఫినిష్ చేసిన సినిమా ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మేలని అనుకుంటాను. ప్రస్తుతం నేను నా పాత్రకి ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందా అని ఎదురుచూస్తున్నాను.

ప్రశ్న) జేమ్స్ బాండ్ లో మీ రోల్ గురించి చెప్పండి.?

స) ఇది నా సెకండ్ సినిమా కానీ నాకు మాత్రం నా తొలి సినిమా ఇదేననే ఫీలింగ్ ఉంది. ఈ సినిమాలో నేనొక లేడీ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తా, చాలా స్ట్రాంగ్ అండ్ సీరియస్ గా ఉండే పాత్ర. ఇందులో నేను చాలా రిస్కీ స్టంట్స్ చేసాను, అవి చేసే టైంలో బాగా ఎంజాయ్ చేసాను.

ప్రశ్న) లేడీ జేమ్స్ బాండ్ పాత్ర చేయడంలో మీకు బిగ్గెస్ట్ చాలెంజ్ గా అనిపించింది ఏమిటి.?

స) మన సినిమాల్లో వచ్చే రెగ్యులర్ గ్లామరస్ పాత్ర కాదు నేను చేసింది. అందుకే షూటింగ్ మొదట్లో నా పాత్ర మూడ్ లోకి వెళ్ళడం కాస్త కష్టంగా అనిపించేది. కొద్ది రోజులు షూట్ చేసాక అంతా బాగా అనిపించింది, చకచకా ఫినిష్ చేసేసాం.

ప్రశ్న) కామెడీ కింగ్ అల్లరి నరేష్ తో పనిచేయడం ఎలా ఉంది.?

స) చెప్పాలంటే నరేష్ మరియు నేను స్వతహాగా దాదాపు ఒకే రకమైన మనస్తత్వం కలవాళ్ళం. నాలాగే తను కూడా సిగ్గుపడే మనస్తత్వం కలవాడు. షూటింగ్ టైంలో త్వరగా కలిసిపోయాం. నాకు తెలిసి కామెడీలో అల్లరి నరేష్ మాస్టర్ అని చెప్పాలి. ఈ సినిమాతో మరో సారి ఆడియన్స్ ని తెగ నవ్విస్తాడు.

ప్రశ్న) జేమ్స్ బాండ్ విషయంలో మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి.?

స) నా పరంగా అయితే సినిమా అందరినీ నవ్వించి మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. నేను చేలా ఓపెన్ మైండెడ్, రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ని నెగటివ్ లేదా పాజిటివ్ దేన్నైనా ఓపెన్ గా స్వీకరిస్తాను.

ప్రశ్న) డెబ్యూ డైరెక్టర్ సాయి కిషోర్ గురించి చెప్పండి.?

స) సాయి కిషోర్ కి ఇది మొదటి సినిమా అయినా సెట్స్ లో అందరికీ సూపర్బ్ సపోర్ట్ ఇచ్చాడు. నా రోల్ రావడానికి తను చాలా సాయం చేసాడు. అలాగే ఈ కామెడీ మూవీని చాలా బాగా తీసాడు.

ప్రశ్న) ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ తో వర్క్ చేయడం ఎలా ఫీలవుతున్నారు.?

స) ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. వారి సినిమాలో నాకు మెయిన్ రోల్ ఇవ్వడమే కాకుండా, షూటింగ్ టైంలో చాలా బాగా ట్రీట్ చేసారు. వారికి నా స్పెషల్ థాంక్స్.

ప్రశ్న) భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.?

స) నాకు యోగ బ్యూటీ అనుష్క అంటే చాలా ఇష్టం, తనే నాకు స్ఫూర్తి. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేసిన డిఫరెంట్ సినిమాలను నా కెరీర్లో నేను కూడా చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) ప్రస్తుతం మీరు వర్క్ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి.?

స) ప్రస్తుతం నేను ఓ హిందీ ఫిల్మ్ చేస్తున్నాను. ప్రముఖ మ్యుజిషియన్ ఇస్మాయిల్ దర్బార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తాజా వార్తలు