ఇంటర్వ్యూ : వినోద్ అనంతోజు – మిడిల్ క్లాస్ అందరికీ “మిడిల్ క్లాస్ మెలోడీస్” నచ్చుతుంది

ఇంటర్వ్యూ : వినోద్ అనంతోజు – మిడిల్ క్లాస్ అందరికీ “మిడిల్ క్లాస్ మెలోడీస్” నచ్చుతుంది

Published on Nov 12, 2020 6:10 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా మొదటి చిత్రం “దొరసాని”తో ఆకట్టుకుని ఇప్పుడు తన రెండో సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్” తో నవంబర్ 20 అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ తో రానున్నాడు. మరి ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు వినోద్ అనంతోజుతో వర్చువల్ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి తాను ఎం చెప్పారో చూద్దాం.

ఈ ప్రాజెక్ట్ ఎలా రూపు దిద్దుకొంది?

ఓ దర్శకునిగా ఈ స్క్రిప్ట్ ను పట్టుకొని దాదాపు రెండేళ్ల పాటు చాలానే ప్రొడక్షన్ హౌస్ లకు తిరిగాను. ఆ క్రమంలో ఆనంద్ ను కలిసి కథ చెప్పగా అతడికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.

ఆనంద్ దేవరకొండ ను ఎలా తీసుకొన్నారు?

నేను ఆనంద్ ని కలిసే సమయానికి తాను చేసిన “దొరసాని” ఇంకా రిలీజ్ కాలేదు. మా ఇద్దరి మధ్య పరిచయం బాగా అయ్యాకనే ఈ సినిమా ఓకే అయ్యింది. అలాగే ఈ సినిమాలో ఆనంద్ పక్కా గుంటూరు యువకుడిలా కనిపించేందుకు ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా ప్లాన్ చేసాం. అతను ఆ రోల్ లో కచ్చితంగా ఇంప్రెస్ చేస్తాడని నమ్మకం ఉంది.

ఈ గుంటూరు సిటీ బ్యాక్ డ్రాప్ తీసుకోడంలో కారణం ఎమన్నా ఉందా?

ముందుగా నా నేటివ్ ప్లేస్ గుంటూరు కాదు. కానీ చదువు పరంగా ఎక్కువగా గడిపింది మాత్రం అక్కడే. అలా అక్కడ ప్రాంతం కల్చర్ బాగా నచ్చి కొన్ని నిజమైన పాత్రల ఆధారంగా ఈ స్క్రిప్ట్ ను రాసుకున్నాను.

వర్ష బొల్లమ్మ ను ఎలా అప్రోచ్ అయ్యారు.?

తమిళ చిత్రం “96” చూసినపుడు ఆమె నటన మరియు ఎక్స్ ప్రెషన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అప్పుడు నా స్క్రిప్ట్ కు ఆమె అయితేనే కరెక్ట్ అని ఫిక్సయ్యా. తర్వాత ఆమెను కలిసి స్క్రిప్ట్ వినిపించడంతో ఆమె ఓకే చేసింది.

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ ఎలా అనిపిస్తుంది?

సరిగ్గా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా లాక్ డౌన్ వచ్చింది. దానితో బాగా డిజప్పాయింట్ అయ్యాను. అప్పుడు సినిమా రిలీజ్ ఎలా అన్నది కూడా ఏంటి అర్ధం కాలేదు. కానీ అమెజాన్ ప్రైమ్ సినిమా హక్కులను కొనుక్కోవడంతో కాస్త హ్యాపీ ఫీలయ్యాను. అలాగే మరింత మందికి అందుబాటులోకి ఉండడం ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ గా ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను.

ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్ ఏంటి?

మా సినిమా అంతా మిడిల్ క్లాస్ ఆడియెన్స్ లైఫ్ స్టైల్ పైనే తీసింది. చూసాక ఈ టైటిల్ సరైందే అని అంతా అనుకుంటారు. అలాగే మా సినిమా మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రతీ ఒక్కరికీ రీచ్ అయ్యి మా నమ్మకాన్ని నిలబెడుతుంది కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

నిర్మాణ సంస్థ కోసం ఎమన్నా చెప్పండి

మా నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు. నేను సినిమాకు ఏం కావాలి అన్నా సినిమా పూర్తయ్యే వరకు కాదనకుండా ఇచ్చారు.

ఫ్యూచర్ ప్రాజెక్టుల ప్లానింగ్స్ ఏంటి?

ప్రస్తుతానికి కొన్ని స్క్రిప్టులపై వర్క్ చేస్తున్నాను. అలాగే త్వరలోనే నా రెండో సినిమాను అనౌన్స్ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు