ప్రత్యేకం : కోలీవుడ్ స్టార్స్ కి టాలీవుడ్ ఆహ్వానం.!

ప్రత్యేకం : కోలీవుడ్ స్టార్స్ కి టాలీవుడ్ ఆహ్వానం.!

Published on Nov 13, 2014 12:32 PM IST

mimu-sitham
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని హుదూద్ బాధితుల కోసంఏపి సిఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నవంబర్ 30న జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని వారే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రముఖులు రానున్నారని ఇదివరకే తెలియజేశాము.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటి అంటే.. రేపు టాలీవుడ్ లోని ప్రముఖులైన డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.వి ప్రసాద్ తదితరులు కలిసి చెన్నై వెళ్లనున్నారు. చెన్నై వెళ్లి స్వయంగా రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, విక్రమ్, కార్తి , విశాల్, డైరెక్టర్ శంకర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ లను డైరెక్ట్ గా కలిసి మేముసైతం ప్రోగ్రాం కి ఆహ్వానించనున్నారు. వీరందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా పరిచయం ఉన్నవారే కావడం వలన కచ్చితంగా ఈ ఈవెంట్ కి హాజరవుతారని అంటున్నారు.

నవంబర్ 30న ‘మేముసైతం’ ప్రోగ్రాం కంటిన్యూగా 12-15 గంటల పాటు జరగనుంది. అలాగే అదే రోజు స్టార్స్ క్రికెట్ మ్యాచ్ కూడా జరగనుంది. స్టార్ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ మీకు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి.

తాజా వార్తలు